చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదూ..! అందమైన అమ్మాయిలు, అబ్బాయిలంతా కలిసి దిగిన ఈ గ్రూప్ ఫొటో చాలా ముచ్చటేస్తోంది. ఇదంతా మా డిగ్రీ సమూహం. నేను వికారాబాద్‌లో డిగ్రీ చదివేటప్పుడు ఓ అమ్మాయి బర్త్‌డే సందర్భంగా దిగిన ఫొటో ఇది. ఈ ఫొటోలోని అబ్బాయిలందరూ బీఎస్సీ (కంప్యూటర్స్) గ్రూప్ అయినా అందులో బీఎస్సీ (బీజేడ్సీ) గ్రూప్‌కు చెందిన కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు.
ఆ అమ్మాయి (బర్త్‌డే) పుణ్యమా అని.. మూడేళ్ల డిగ్రీ కాలంలో మేమంతా గ్రూప్‌గా కలిసే అవకాశం ఒకేఒకసారి.. అదీ ఈ రూపంలో లభించింది. ఇందులో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్న పాప..మా క్లాస్‌మేట్ వాళ్ల అక్క కూతురు. అంతా పెద్దవాళ్లే ఉంటే ఎలా..చిన్నారుల సందడి ఉంటేనే కదా బర్త్‌డే ఫంక్షన్ రసవత్తరంగా ఉంటుందనుకుందో ఏమో.. మా క్లాస్‌మేట్ వాళ్ల సోదరి కూతురుతో హాజరై పోగ్రామ్‌కు మరింత వన్నె తెచ్చింది. ఏదేమైనా డిగ్రీ క్లాస్‌మేట్‌లంతా హాజరైన ఆ ఫంక్షన్ బర్త్‌డే అమ్మాయితో పాటు మాకందరికీ ఓ తీయని అనుభూతిని మిగిల్చింది.
కొసమెరుపు: ఫొటోకు అందరూ ఫోజిచ్చారు కానీ.. నేను (శ్రీభానుకాంత్) కనబడటంలేదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా! నిజమేనండీ..నా బ్యాడ్‌లక్.. ఆ ఫంక్షన్‌కు నేను చాలా లేట్‌గా అటెండ్ అయ్యాను. అప్పటికే ఫొటో సెషన్ కూడా పూర్తవడంతో ఆ గ్రూప్‌లో కలిసే అవకాశం లేకుండా పోయింది. ఏదేమైనా.. అందులో ఉన్నదంతా నా మిత్రులే కదా..సో నో అన్‌హ్యాపీ!
0 comments:
Post a Comment